కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు

UPDATED 7th JANUARY 2020 TUESDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సంక్రాంతి సందర్భంగా కోడి పందేలపాటు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సామర్లకోట తహసీల్దార్ జితేంద్ర హెచ్చరించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, తదితర ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జితేంద్ర మాట్లాడుతూ కోడి పందేల నిర్వహించడం నిషేధమని, కోడి పందేలకు ఎలాంటి అనుమతులు లేవని, వాటిని పూర్తిస్ధాయిలో అరికట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించకుండా చూడాలని, ఈ విషయంలో ముందుగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లపై ఉందన్నారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు సంక్రాంతి పండుగను నిర్వహించుకునే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. ఎస్ఐ సుమంత్ మాట్లాడుతూ కోడిపందేల నిర్వహణకు ఎటువంటి అనుమతులు లేవని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఆలాగే పందెం కోళ్లు పెంచుతున్న వారిపై నిఘా పెట్టామని, పందేలు నిర్వహించిన వారితో పాటు కాసిన వారిని ఉపేక్షించమన్నారు. కోడి పుంజులకు కత్తులు తయారు చేసే వారిని, కత్తులు కలిగిన వారిని గుర్తించి బైండోవర్‌ చేస్తామన్నారు. పందేలకు స్థలాలు ఇచ్చినా, పొలాల్లో ఏర్పాట్లు చేసినా సంబంధిత యజమానులపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఈఓపీఆర్డీ సూర్యనారాయణ, అడిషనల్ ఎస్ఐ కిషోర్ కుమార్, వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us