ఉల్లాసంగా....ఉత్సాహంగా..

* లెనోరాలో అంబరాన్నంటిన వార్షికోత్సవ వేడుకలు
* ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
UPDATED 27th FEBRUARY 2018 TUESDAY 10:00 PM
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం కె.ఎల్.ఆర్. లెనోరా దంత వైద్య కళాశాల వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెంటల్ ప్రెసిడెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ దంత వైద్య ప్రాముఖ్యాన్ని విద్యార్థులకు వివరించారు. అలాగే ఆధునిక కాలంలో వచ్చే మార్పులను గమనిస్తూ విద్యార్థులు అందుకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. అలాగే దంత వైద్యంలో వచ్చే ఆధునిక మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. మరో ముఖ్య అతిధిగా హాజరైన న్యూఢిల్లీ  ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ రజనీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల యొక్క అవసరాలను తెలుసుకుని కళాశాల యాజమాన్యం అందిస్తున్న సదుపాయాలపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు మంచి విద్యను ఆర్జించి భవిష్యత్తులో మరింతగా పైకి రావాలన్నారు. కళాశాల చైర్ పర్సన్ కె. నాగమణి  మాట్లాడుతూ విద్యార్థులు ఆటపాటలతో పాటుగా చదువుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని, విద్యతోనే విజయం లభిస్తుందన్నారు. కోశాధికారి కె. సింధు మాట్లాడుతూ విద్యార్థులు  మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలని, తద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రశాంతతతోనే విజయం పొందవచ్చని విద్యార్థులకు సూచన చేశారు. కళాశాల కార్యదర్శి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులకు గౌరవం తెచ్చేలా జీవితంలో నడుచుకోవాలని, అలాగే కళాశాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అలాగే మనం ఎంచుకున్న రంగంలో మరింతగా అభివృద్ధి చెందేలా ముందుకు సాగాలన్నారు. అనంతరం ఢీ ఫేమ్ యశ్వంత్ విద్యార్థులను తనదైన శైలిలో ఉత్సాహపరిచారు. అలాగే విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే విజేతలకు బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు కె. గోవిందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads