చేనేత సంక్షేమ పథకాలు పెంచాలి

Updated 26th April 2017 Wednesday 12:30 PM

పెద్దాపురం: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత పరిశ్రమను పరిరక్షించేందుకు, చేనేత కార్మికులను ఆదుకునేందుకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని పెద్దాపురం చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు తూతిక సత్యనారాయణ అన్నారు. స్థానిక అంకయ్యపేటలోని సొసైటీ మేనేజర్ ఆశపు సాంబమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో చేనేత కార్మికుల పిల్లలకు ఆయన చేతుల మీదుగా ఉపకార వేతనాలను బుధవారం పంపిణీ చేశారు. చేనేత సొసైటీల ద్వారా అమ్మకాలు జరిపే వస్త్రాలకు ప్రభుత్వం ౩౦ శాతం రాయితీ అమలు చేయాలన్నారు. సొసైటీల నుంచి ఆప్కో కొనుగోలు చేసే వస్త్రాలకు వెంటనే బిల్లుల సొమ్ము మంజూరు చేయాలన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా సొసైటీలు తీసుకున్న రుణాలకు రూ. లక్షల్లో వడ్డీలు కట్టాల్సి వస్తోందన్నారు. అనంతరం 26  మంది పిల్లలకు రూ. 1200  చొప్పున ఉపకార వేతనాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు చీపూరి సత్యనారాయణ, గోరు కృష్ణ , కుడకా మహేశ్వరరావు, కనకం సూరయ్య, బొమ్మన సత్యనారాయణ, గోరు శ్రీనివాస్, బొండపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.     

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us