బాలల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కృషి

UPDATED 10th AUGUST 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: బాలల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎంఇవో వై.వి. శివరామకృష్ణయ్య అన్నారు. సామర్లకోట మండలం అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో జాతీయ సామూహిక నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం విద్యార్థులకు ఆల్బెన్డాజోల్ మాత్రలను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రతీ శుక్రవారం చేతుల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్.ఎ.ఆర్. మూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

ads