రామేశంమెట్ట గ్రావెల్ తవ్వకాలపై సమగ్ర విచారణ

* పరిమితికి మించి అనధికారికంగా అక్రమ తవ్వకాలు * జాయింట్ కలెక్టరుతో విచారణ జరిపిస్తామని వెల్లడి * తవ్వకాలు తక్షణం నిలిపివేయాలని ఆదేశం * మైనింగ్ అధికారులపై జిల్లా కలెక్టర్ మరళీధర్‌రెడ్డి ఫైర్ పెద్దాపురం: రామేశంమెట్టపై ఇంతవరకూ జరిగిన గ్రావెల్ తవ్వకాలపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్‌ డి. మురళీధరరెడ్డి పేర్కొన్నారు. రామేశంమెట్టపై జరుగుతున్న తవ్వకాలను రెవెన్యూ, మైనింగ్ అధికారులతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. సుమారు 800 ఎకరాల్లో పెద్దాపురం మండలం ఆనూరు, కొండపల్లి, వాలు తిమ్మాపురం, గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామాల్లో విస్తరించిన రామేశంమెట్టపై గత కొన్ని సంవత్సరాలుగా తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్వకాలకు కొంతమేర అనుమతులు తీసుకుని నిబంధనలకు విరుద్దఃగా ప్రభుత్వం ఇచ్చిన పరిమితికి మించి తవ్వకాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో జిల్లా కలెక్టర్ రామేశంమెట్టను పరిశీలించారు. ఇప్పటివరకూ సుమారు 150 ఎకరాలకు పైబడి తవ్వకాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. అలాగే ప్రస్తుతం అక్కడ జరుగుతున్న తవ్వకాలను తక్షణం నిలిపివేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పొలాలను అమాయక రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి పంటలు పండే భూములను గ్రావెల్‌ క్వారీలుగా మార్చేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తవ్వకాలకు సంబంధించి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌తో సమగ్ర విచారణ జరపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎంతమేర అనుమతులు తీసుకున్నారు, ఎంతమేర తవ్వకాలు సాగించారు, అలాగే ఎంత ప్రాంతంలో తవ్వకాలు జరిగాయో పెద్దాపురం తహసీల్దార్‌ కలగర గోపాలకృష్ణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏడీబీ రోడ్డు విస్తరణలో భాగంగా బీఎస్సార్‌ సంస్థ పరిమితికి మించి తవ్వకాలు జరపడంపై జిల్లా కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు పండే భూముల్లో ఇంత దారుణంగా తవ్వకాలు సాగుతుంటే మీరు ఏం చేస్తున్నారంటూ మైనింగ్ అధికారులపై జిల్లా కలెక్టర్ ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ తేజ, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us