మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి

UPDATED 5th JUNE 2019 WEDNESDAY 7:00 PM

పెద్దాపురం: ప్రతీ ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరెంటెండెంట్ డాక్టర్ రవికాంత్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మన పెద్దాపురం ఫేస్ బుక్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆయన బుధవారం మొక్కలు నాటారు. అనంతరం డాక్టర్ రవికాంత్ మాట్లాడుతూ మొక్కలు నాటడం వలన వాతావరణం సమతుల్యంగా ఉంటుందన్నారు. విస్తృతంగా మొక్కలు నాటడం వలన వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, వాయు కాలుష్యం తగ్గించిన వారమవుతామని పేర్కొన్నారు. భావి తరాలకు ప్రాణవాయువు అందించడానికి మొక్కలు నాటి సంరక్షించాలని, మొక్కలు నాటడం ముఖ్యం కాదని, వాటిని సంరక్షణ చేయాల్సిన బాధ్యత కూడా మన అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మన పెద్దాపురం ఫేస్ బుక్ టీమ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.     

ads