పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం

UPDATED 1st SEPTEMBER 2018 SATURDAY 7:00 PM

సామర్లకోట: పాఠశాల పరిసరాలు, గ్రామాలు శుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఆవిర్భవిస్తుందని, ఇదే ఆశయంతో స్వచ్ఛభారత్‌ అమలవుతోందని ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ అన్నారు. స్థానిక అయోధ్యరామపురంలో గల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛపక్వడా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తామని, పాఠశాల, ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని, ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గిస్తామని, తడి, పొడి చెత్తలను విడివిడిగా సేకరిస్తామని విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా కలిసి స్వచ్ఛశపథ్‌ (ప్రతిజ్ఞ) చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల ఒకటి నుంచి 15వ తేదీ వరకు స్వచ్ఛ పక్వాడా కార్యక్రమం అమలు జరుగుతుందని హెచ్ఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షఫీ, రాజేంద్ర కుమార్, కోడూరి శివప్రసాద్, సుబ్రహ్మణ్యేశ్వరి, లక్ష్మీవిజయ, తదితరులు పాల్గొన్నారు.     

ads