విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి గైట్ తో ఎంవోయు

UPDATED 5th MAY 2018 SATURDAY 9:00 PM

రాజానగరం: గైట్ కళాశాలల విద్యార్థులతో పాటు వరిసర గ్రామాల్లోని ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ (డిప్లమో) విద్యా ర్థులకు సాంకేతిక నైపుణ్యాలు అందించేందుకు తమ కళాశాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎంపిక చేసుకున్నట్లు గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ తెలిపారు.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు, గైట్ కళాశాలలకు మధ్య శనివారం జరిగిన ఎంవోయూ పత్రాలను గైట్ మేనేజింగ్ డైరెక్టర్ శశికిరణ్ వర్మ, ఎ.పి.ఎస్.ఎస్.డి.సి ఇనస్పెక్షన్ టీమ్ కో-ఆర్డినేటర్ ఎం. రామకృష్ణ పరస్పరం అందిపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో శశికిరణ్ మాట్లాడుతూ తమ కళాశాలలో ఎ.పి.ఎస్.ఎస్.డి.సి ఇప్పటికే సీమెన్స్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. గోదావరి కౌశల్ యోజన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ పాఠశాలలకు చెందిన ట్రైనీలు, విద్యార్థులు ఈ కేంద్రంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందారని చెప్పారు. ఇంతవరకు 4,417 మందికి నైపుణ్యాభివృద్ధిపై ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఒప్పందంతో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి అవసరమైన మరిన్ని అదనపు సౌకర్యాలు కల్పించేందుకు వీలు కలుగుతుందన్నారు. దీనితో పాటు మైక్రోసాఫ్ట్, వర్చ్వూస వంటి ప్రముఖ బహుళజాతి సంస్థలు, జర్మనీ ఎ.ఆర్.సి సంస్థతో తమ విద్యాసంస్థ చేసుకున్న ఎంవోయులు తమ కళాశాల విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ ఎం. వరప్రసాదరావు, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, ఎ.పి.ఎస్.ఎస్.డి.సి ఇనస్పెక్షన్ టీమ్ మేనేజర్ విజయభాస్కర్, ఇనస్పెక్షన్ టీమ్ ఇనస్పెక్టర్ ఎల్.వి. రామారావు, టీమ్ సభ్యులు చైతన్య, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

ads