పేద ప్రజలకు పక్కా గృహాలు

UPDATED 7th AUGUST 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: పేద ప్రజలకు పక్కా గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వ భూములను సేకరిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఈ సందర్భంగా స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రానికి చెందిన ఎనిమిది ఎకరాలు, బిసి బాలుర, బాలికల హాస్టల్స్ వద్ద ఉన్న స్థలాలు, ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ఉన్న భూములను హోంమంత్రి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. మల్లికార్జునతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్డీవో ఎల్. రఘుబాబు, తహసీల్దార్ ఎల్. శివ కుమార్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, రైతు సంఘం అధ్యక్షుడు కంటే బాబు, ఈటీసీ ఫ్యాకల్టీలు సిల్వియా, రాంబాబు, ఎస్.కె. మొహిద్దీన్, బడుగు శ్రీకాంత్, అందుగుల జార్జ్ చక్రవర్తి, జి. బూరయ్య, తదితరులు పాల్గొన్నారు.

ads