అందరికీ ఇళ్ళు ఫేజ్-1 పనులు వెంటనే పూర్తిచేయాలి

UPDATED 30th JANUARY 2019 WEDNESDAY 6:00 PM

పెద్దాపురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెద్దాపురం మండలం వాలుతిమ్మాపురం రహదారిలో  నిర్మించిన అందరికీ ఇళ్ళు పథకం ఫేజ్-1 పనులు ఫిబ్రవరి 4వ తేదీనాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు కార్తికేయమిశ్రా అధికారులను ఆదేశించారు. వచ్చేనెల 9వ తేదీన గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహించనున్న సందర్భంగా అందరికీ ఇళ్ళు పనులను కలెక్టరు బుధవారం పరిశీలించారు. ఈ ఫేజ్-1కి సంబంధించి మౌలిక వసతులు ఏర్పాట్లు వచ్చే నెల 4వ తేదీలోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరు వెంట మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, తహసీల్దార్ గంగుమళ్ల బాలసుబ్రహ్మణ్యం, ఎలక్ట్రికల్ డిఇ ఉదయ భాస్కర్, ఎఇ కృష్ణ, ఎడిఎ శివరామకృష్ణ, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads