మమతకు రూ. లక్ష ప్రోత్సాహం

UPDATED 18th SEPTEMBER 2018 TUESDAY 6:00 PM

రాజానగరం: జాతీయస్థాయి రైఫిల్ షూటింగ్ లో పాల్గొనేందుకు సాధన చేస్తున్న దెందుకూరి నాగదుర్గ మహితకు రాష్ట్ర శాసన మండలి మాజీ విప్, చైతన్య విద్యాసంస్థల చైర్మన్ కె.వి.వి. సత్యనారాయణరాజు (చైతన్య రాజు) రూ. లక్ష నజరానాగా అందచేశారు. గైట్ కళాశాలలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మహితను అభినందించారు. అటు చదువులో, ఇటు క్రీడల్లోనూ కూడా మంచి ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్న మహితకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. జాతీయస్థాయి రైఫిల్ షూటింగ్ తో పాటు ఒలెంపిక్స్ లో కూడా పాల్గొని మాతృదేశానికి మరింత కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆమెను ఆశీర్వదించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా మహితకు తాము ఈ ప్రోత్సాహాన్ని అందచేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎంఎల్సీ కె. రవికిరణ్ వర్మ, గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ మహితను అభినందించారు. ఈ కార్యక్రమంలో చైతన్య విద్యా సంస్థల సిఇవో డాక్టర్ డి.ఎల్.ఎన్. రాజు, డైరెక్టర్ పి.వి. కృష్ణంరాజు, జనరల్ మేనేజర్ ఎ. నరేష్ రాజు, గైట్ డైరెక్టర్ కె.వి. రామరాజు, తదితరులు పాల్గొన్నారు.       

ads