కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె

UPDATED 7th OCTOBER 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: అరకొర వేతనాలతో సతమతమవుతున్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ మున్సిపల్‌ కార్మికులు చేస్తున్న సమ్మె ఆదివారం నాల్గవ రోజుకు చేరుకుంది. స్థానిక బళ్ళ మార్కెట్ సెంటరు నుంచి గాంధీబొమ్మ సెంటరుకు వరకు ర్యాలీ  నిర్వహించి మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఎఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి చంద్రదాస్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణను ప్రయివేటుపరం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 279తో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఎప్పటికైనా రెగ్యులర్‌ అవుతామనే ఆశతో అరకొర జీతాలతోనే సమస్యల నడుమే పనిచేస్తున్నారని,  ఈ నేపథ్యంలో జీవో 279 ఉన్న ఉద్యోగం సైతం దూరం చేసేలా ఉందని అన్నారు. ఈ జీవోను తక్షణం రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ ఆయన చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు శీరంశెట్టి వెంకటేష్, సింగంపల్లి శ్రీనివాస్, వేల్పుల సింహాచలం, కశింకోట మంగ, పెనుమాకుల సారమ్మ,  అల్జారి లోవరాజు, దుర్గాప్రసాద్, అప్పలకొండ, తదితరులు పాల్గొన్నారు.

 

ads