ఆగస్ట్ 9న అర్హులందరికీ పట్టాలు పంపిణీ : కలెక్టర్ మురళీధర్ రెడ్డి

రంపచోడవరం, 21 మే 2020 (రెడ్ బీ న్యూస్):గిరిజనులకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 ప్రకారం రానున్న ఆగష్టు 9న జరగనున్న గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆటవీ హక్కుల పట్టాలు అర్హులైన వారందరికి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుందని జిల్లా కలెక్టరు డి.మురళీధర్ రెడ్డి అన్నారు.జిల్లా కలెక్టర్ కాకినాడ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఆటవీ,అభయారణ్య పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు.పోలవరం ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో అటవీ భూములు,అటవీ బ్లాకులు రిజ్వరేషన్,పోలవరం ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఉన్న డి ఫారం పట్టాలు రద్దు పరచడం,ఓఎస్ఆర్ రోడ్లు,నరేగా పథకం అమలుతీరు,వేతనాలు చెల్లింపులు,అటవీ సంరక్షణ చట్టం,చెక్ పోస్టులు, ప్రజావసరాలు,అటవీ భూములు కేటాయింపునకు ప్రతిపాదనలు,అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 వంటి అంశాల పురోగతిపై ఆయన సమీక్షించారు.అలాగే పోలవరం ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో వున్న డి ఫారం పట్టాదారులను గుర్తించి ఆయా నిర్వాసితులకు అదే విస్తీర్ణంలో ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించాలన్నారు.ఇందుకు సంయుక్త సర్వేలను నిర్వహించాలని ఆదేశించారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం రెండవ అవకాశముగా గత జనవరి 14 వ తేదీవరకు క్లయిముదారుల నుంచి తీసుకున్న ధరఖాస్తులను నిశితంగా పరిశీలించడంతో పాటు సర్వే నివేదికలు, నిబంధనల మేరకు అర్హులను గుర్తించి పట్టాలు జారీకి అన్ని చర్యలు పారదర్శకంగా చేపట్టాలన్నారు.రాబోయే ఆగష్టు 9 తేదీన అర్హులందరికి పట్టాలు పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇంచార్జ్ పివో ప్రవీణ ఆదిత్య మాట్లాడుతూ 2006 డిసెంబర్ 13వ తేదీనాటికి సాగులోవున్న కొండపోడు భూములకు అటవీ హక్కుల గుర్తింపు చట్ట ప్రకారం హక్కులు సంక్రమించడం జరుగుతోందన్నారు.ఇందుకు అవసరమైన సర్వేలు, జి.పి.ఆర్ ఎస్ సర్వేలు జాయింట్ తనిఖీలు చేపట్టామని తెలిపారు. అడవితల్లి ఒడిలో పెరిగి భూమిపై మమకారం పెంచుకొని నివాసం ఏర్పాటు చేసుకొని జీవించే గిరిజనులకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం వారిపాలిట వరంగా మారిందన్నారు. మన ప్రకృతి సంపదను రక్షించుకొని,వాటిని పునర్జీవింపచేయడానికి రూపొందించిన ఈచట్టం ద్వారా ఆయా గడువునాటి సాగులో వున్న భూములకు హక్కులను సంక్రమింపచేయడం జరుగుతోందన్నారు.తద్వారా గిరిజనులకు కొండ పోడు భూముల పైన హక్కును ప్రభుత్వం కల్పించడంతో వారి సామాజిక హోదా పెరుగుతోందన్నారు. ఈచట్టం ద్వారా వనరులును సుస్థిరంగా వినియోగించుకునే హక్కు ఆహార భద్రత కల్పించుకునే హక్కు అడవిని పెంచుకునే హక్కు సహజ సంపదను కాపాడుకునే హక్కులు, కమ్యూనిటీని కాపాడుకునే హక్కు ఈ చట్టం ద్వారా వారికి సంక్రమించిందన్నారు. గిరిజన మారుమూల ప్రాంతాలకు అనుసంధాన రోడ్లు వేయడంలో కమ్యూనిటీ పరంగా ఈచట్టం ఎంతగానో దోహదపడి అభివృద్ధికి తోడ్పాటునందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖాధికారిణి డాక్టర్ నందిని సలారియా,ఐటీడీఏ ఎస్.వో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us