మహిళల ఆర్ధిక ఎదుగుదలకు ప్రభుత్వ ప్రోత్సాహం

UPDATED 1st SEPTEMBER 2018 SATURDAY 5:30 PM

సామర్లకోట: ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన కార్యక్రమాలను చేపట్టి  ప్రోత్సహిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఎంపిపి ఆకునూరి సత్యనారాయణ అధ్యక్షతన స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మండల పరిధిలో అర్హత గల 180 మంది ఒంటరి మహిళలను గుర్తించి వారికి రూ.1000 వంతున పింఛన్లు మంత్రి శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ సమాజంలో కొన్ని కారణాల వల్ల ఒంటరిగా జీవిస్తున్న మహిళలను ఆర్థికంగా ఆదుకోవడానికి ఒంటరి మహిళా పింఛన్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశ పెట్టారని అన్నారు. ఇందులో భాగంగానే మండలంలోని అర్హత కలిగిన 180 మందికి రూ. 1000 చొప్పున పింఛన్లు మంజూరు అయ్యాయని, గతంలో రూ. 200 ఉన్న పింఛన్ ముఖ్యమంత్రి రూ.1000 చేశారని తెలిపారు. ప్రభుత్వం వైద్యపరంగా మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీ చేయించుకుంటే పారితోషికంతో పాటు తల్లికి, బిడ్డకు కిట్లు అందచేయడం జరుగుతుందని,  ఎన్టీఆర్ సేవలు ద్వారా ఉచితంగా పరీక్షలు కూడ నిర్వస్తున్నట్లు తెలిపారు. పేదలకు వైద్యానికి లక్షల్లో ఖర్చయితే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి గ్రామాలు అభివృద్ధిలోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని, పారిశుద్యం మెరుగుకు ప్రజలు సహకరించాలని, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు (శ్రీనుబాబు),  వైస్ చైర్మన్ అడబాల చిట్టిబాబు, జెడ్పీటీసీ గుమ్మళ్ళ విజయలక్ష్మి, తోటకూర శ్రీనివాస్, ఎంపిడివో సి.హెచ్. జగ్గారావు, తహశీల్దార్ ఎల్. శివకుమార్, గుమ్మళ్ళ రామకృష్ణ, ప్రత్యేక అధికారులు, ఎంపిటిసిలు, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.
ads