రవితేజ "క్రాక్" ట్రైలర్ వచ్చేసింది..!

(రెడ్ బీ న్యూస్) మాస్ మహారాజ్ రవితేజ తన అభిమానులకు డబుల్ బొనాంజా అందించాడు. రమేశ్‌ వర్మ దర్శకత్వంలో తను నటిస్తున్న 'ఖిలాడి' చిత్రం పోస్టర్‌ను కొద్ది సేపటి క్రితం విడుదల చేశాడు. సంక్రాంతికి విడుదల కాబోతున్న తన `క్రాక్` సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశాడు. ట్రైలర్ రవితేజ స్టైల్లో ఆకట్టుకునే విధంగా ఉంది. వెంకీ వాయిస్ ఓవర్ అందించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మీ శరత్‌కుమార్ విలన్ పాత్రలో కనిపించనుంది. తమన్ సంగీతం అందించాడు
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us