గైట్ లో డిఎంఎస్ విద్యార్థులకు ముగిసిన వర్క్ షాప్

UPDATED 5th JULY 2018 THURSDAY 9:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(గైట్) అటానమస్ కళాశాలలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్ (డిఎంఎస్) విభాగం ఆధ్వర్యంలో ఎంబిఎ విద్యార్థులకు ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు.   డిఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ పి.ఆర్.కె. రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దుబాయ్ ఇన్నోవేషన్, ఇంక్యూబేషన్ సెంటర్ హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసరావు పాల్గొని వ్యవస్థాపకత నైపుణ్యాలు ఏవిధంగా అభివృద్ధి చేసుకోవాలో వివరించారు. పారిశ్రామికవేత్తలుగా విజయవంతం అయ్యేందుకు అవసరమైన నైపుణ్యాలు, దృక్పధాలు వివరించారు. ఔత్సాహిక యువత పారిశ్రామికవేత్తలుగా తయారు కావాలన్నారు. నూతన పరిశ్రమలు స్థాపించేవారు బ్యాంకుల ద్వారా రుణాలు, వివిధ అనుమతులు పద్ధతులు ఆయన వివరించారు. అనంతరం ప్రొఫెసర్ శ్రీనివాసరావును డిఎంఎస్ డైరెక్టర్  ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

ads