ఎంఎంజెఎస్ పట్టణ మహిళా కమిటీ ఎంపిక

UPDATED 2nd AUGUST 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: మాదిగ మహాజన సంఘం (ఎంఎంజెఎస్) సామర్లకోట పట్టణ మహిళా కమిటీ అధ్యక్షురాలిగా ఇండుగపల్లి బేబి ఎన్నికయ్యారు. స్థానిక భీమవరం కొత్తపేటలో ఎంఎంజెఎస్ జిల్లా కమిటీ సభ్యులు మల్లవరపు మేరీ గంథంపండు గృహంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎంజెఎస్ జిల్లా అధ్యక్షులు కాపవరపు కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగల సమస్యలపై అందరూ ఐక్యమత్యంగా పోరాడాలని,  సంఘం బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. అనంతరం నూతన కమిటీ ఎంపిక జరిగింది. అధ్యక్షురాలుగా ఇండుగపల్లి బేబి, ఉపాధ్యక్షురాలుగా శ్రీమంతుల మరియమ్మ, కార్యదర్శిగా ఎస్. శరావతి, సహాయ కార్యదర్శిగా ఉప్పాడ లక్ష్మి, కోశాధికారిగా నందిక శ్యామల, జిల్లా కమిటీ సభ్యులుగా కాకర అచ్చియమ్మ, సభ్యులుగా చెప్పుల నాగమణి, మిరియాల మిస్సమ్మ, నాగళ్ళ కాంతం ఎన్నికయ్యారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us