సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

UPDATED 20th DECEMBER 2020 SUNDAY 8:00 PM

సామర్లకోట (రెడ్ బీ న్యూస్): సామర్లకోట రూరల్ మండలం పనసపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం దర్శించుకున్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగనాగ్, పనసపాడు మాజీ సర్పంచ్ కొత్త వెంకట్ రత్నం (తాతాజీ), మాజీ ఉప సర్పంచ్, గ్రామ కమిటీ అధ్యక్షులు చీకట్ల వెంకటేష్, టీడీపీ సీనియర్ నాయకులు తటవర్తి శ్రీనివాస్, వెలుగుబంట్ల సూరిబాబు, ఈతా లోవరాజు, పాలూకూరి శ్రీనివాస్, తదితరుల పాల్గొన్నారు.

ads