ఘనంగా ఉరుస్ షరీఫ్ గంధోత్సవం

UPDATED 20th JANUARY 2018 SATURDAY 10:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణ శివారులో ఉన్న హజరత్ షేక్ మదీనా పాచ్చా ఔలియా దర్గా వద్ద ఉరుస్ షరీఫ్ గంధోత్సవం శనివారం ఘనంగా ప్రారంభమైనది. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎం.ఎల్.సి బొడ్డు భాస్కర రామారావుకు ముస్లిం మతపెద్దలు షేక్ గపూర్, ఎం.ఎల్. ఆలీ, మహమ్మద్ లాయక్ ఆలీ, ఎం.ఎల్.కరీం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భాస్కర రామారావు మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతీక ఈ గంధోత్సవం అన్నారు. ముస్లింల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని, కుల,మతాలకు అతీతంగా జరుగుతున్న ఈ గంధోత్సవంలో పాల్గోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముస్లిం అంజుమన్ వ్యవస్థాపకుడు ఎం.ఎ. సత్తార్ ఇంటి నుంచి మేళతాళాలతో ప్రత్యేక ప్రార్ధనలు అనంతరం గంధాన్ని ఊరేగించి, ఆ గంధాన్ని సమాధికి పూసి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఖురాన్ ఖానీ, ఖవ్వాలి, ఫాతేహా ఖానీ, మిమిక్రి, మ్యాజిక్ షో తదితర కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ త్సలికి సత్యభాస్కర్, బాబూలాల్ రఫీ, జిలాని, ఆరిఫ్ ఆలీ, కౌన్సిలర్లు విజ్జపు రాజశేఖర్, బేదంపూడి సత్తిబాబు, ముస్లిం పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.        

ads