హరికృష్ణకు ఘన నివాళులు

UPDATED 30th AUGUST 2018 THURSDAY 6:30 PM

సామర్లకోట: సీతయ్యగా, శ్రీరాములయ్యగా, ఒక్కమగాడిగా సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ మంచి నాయకుడిగా అభిమానాన్ని చూరగొనడంలో నందమూరి హరికృష్ణ  ప్రజలపై తనదైన ముద్రను వేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం స్థానిక వాసుల్ని  కలిచివేసింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు ఆయన మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక మఠం సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద టిడిపి నాయకులు హరికృష్ణ ఫొటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హరికృష్ణ అమర్రహే..హరికృష్ణ అమర్రహే అంటూ ఆయనను గుర్తు తెచ్చుకుని పది నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, శ్రీ భీమేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, కౌన్సిలర్ బడుగు శ్రీకాంత్, ఫణికుమార్, వార్డు కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.    

ads