ఘనంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు

UPDATED 2nd SEPTEMBER 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పెద్దాపురం నియోజకవర్గ జనసేన నాయకుడు తుమ్మల రామస్వామి(బాబు) ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా పార్టీ  పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు మారిశెట్టి  రాఘవయ్య, రాష్ట్ర కోఆర్డినేటర్ చింతల పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల సమక్షంలో కేకును కట్ చేశారు. అనంతరం వృద్దులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. పవన్ కల్యాణ్ సీఎం అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ ఫాన్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఎస్. ఉదయకుమార్, అధ్యక్షుడు తుమ్మల ప్రసాద్, ఉపాధ్యక్షుడు సిహెచ్ నాగేశ్వరరావు, కార్యదర్శి సరోజ్ వాసు, జాయింట్ సెక్రటరీ బి. నానాజీ, ట్రెజరర్ ఎండి షఫియుల్లా, నాగేశ్వరరావు, దుర్గా, అల్లిమిల్లి శ్రీను, తిక్కిరెడ్డి కాశీ, అధిక సంఖ్యలో జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
 
ads