అంగరంగ వైభవంగా భీమేశ్వరస్వామి కళ్యాణం

UPDATED 11th FEBRUARY 2018 SUNDAY 10:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని పంచారామ క్షేత్రం శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి వారి కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి  ఉత్సవాలలో భాగంగా ఉదయం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అనంతరం మధ్యాహ్నం ఉత్సవ మూర్తులను నందివాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి ధ్వజారోహణం నిర్వహించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అన్నవరం దేవస్థానం వేదపండితులు శ్రీపాద రాజశేఖరశర్మ, కపిలవాయి రామశాస్త్రి, హనుమంతవజ్జుల అమరేశ్వర అవధాని, గంగాధరభట్ల శ్రీనివాస్, ముత్య వెంకటరాజు, ఆలయ వేదపండితులు వేమూరి సోమేశ్వర శర్మ, కొండేటి జోగారావు, సన్నిధిరాజు వెంకన్న, సుబ్బన్న, చెరుకూరి రాంబాబు మంత్రోచ్ఛరణల నడుమ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అన్నవరం దేవస్థానం ఈవో జితేంద్ర ఆధ్వర్యంలో స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పులి నారాయణమూర్తి, ట్రస్టుబోర్డు చైర్మన్ కంటే బాబు, ట్రస్టుబోర్డు సభ్యులు, పడాల వీరబాబు, మహంకాళి వెంకట గణేష్, గొల్లపల్లి కామరాజు, బాడితమాని త్రిమూర్తులు, పెద్దాపురం డి.ఎస్.పి చిలకా వెంకట రామారావు, సిఐ ప్రసన్న వీరయ్యగౌడ్, సామర్లకోట ఎస్సై శ్రీనివాస్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు చుండ్రు గోపాలకృష్ణ, పసల పద్మరాఘవరావు, మట్టపల్లి రమేష్, ఆర్.వి. సుబ్బరాజు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, కౌన్సిలర్లు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ads