పులివెందులలో ఓటు వేసిన వైఎస్‌ జగన్‌

UPDATED 11th APRIL 2019 THURSDAY 10:00 PM

కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.యస్. జగన్మోహన్ రెడ్డి గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కడప జిల్లా పులివెందులలో తన భార్య భారతి, తల్లి విజయమ్మతో కలిసి ఆయన ఓటు వేశారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలంటే ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, దేవుని దయవల్ల రాష్ట్రంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాని తెలిపారు. నిర్భయంగా ఓటు వేయాలని ప్రజలకు ఆయన పిలుపు ఇచ్చారు. 

ads