లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం

* డిప్యూటీ డీఎంహెచ్ఓ సరిత

UPDATED 1st SEPTEMBER 2021 WEDNESDAY 2:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం డివిజన్ పరిధిలో రిజిస్టర్డ్, అనుమతి లేని, అర్హతలేని డాక్టర్లు స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తుంటే వారిపై జిల్లా పిసి, యు.పి.ఎస్.డి.టి సెల్ కు తెలియజేయాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్  పి. సరిత తెలిపారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ స్థాయి ఎస్.డి.ఎల్.ఎ.ఎల్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ సరిత మాట్లాడుతూ డివిజన్ పరిధిలో అధికారికంగా రిజిస్టర్ అయిన 28 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని, కొత్తగా సెంటర్లు ఏర్పాటు చేసుకునే వారు ముందుగా జిల్లా వైద్య శాఖ అధికారి అనుమతి పొంది ఏర్పాటు చేసుకోవాలన్నారు. స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ సమాచారాన్ని చట్టప్రకారం బహిర్గతం చేయకూడదని, దీనిని ఎవరు అతిక్రమించిన వారిపై చట్టప్రకారం కమిటీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి డివిజన్లో ఉన్న అన్ని స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు కమిటీ నిర్వహిస్తుందన్నారు. నాలుగు నెలలు నిండిన గర్భిణీలను తనిఖీ నిమిత్తం స్కానింగ్ సెంటర్ కు కమిటీ పంపడం జరుగుతుందని, ఆమెకు స్కానింగ్ టెస్ట్ కు అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ కు సంబంధించిన ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ లింగనిర్ధారణ సమాచారం తెలుసుకొని చాలామంది ఆడ శిశువు అనగానే గర్భస్రావం చేయించుకోవడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీనిని అరికట్టడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కమిటీకి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ చైర్మన్ గా వ్యవహరిస్తారని, అలాగే డిఎస్పీ, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ఎన్జీవోలు, లీగల్ అడ్వైజర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కమిటీలో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం సర్కిల్ ఇనస్పెక్టర్ విజయ్ కుమార్, లీగల్ అడ్వైజర్ వనమోక్ష రవికుమార్, వైద్యులు హర్షవర్ధన్, సుకన్య, సమాచార శాఖ ప్రతినిధి సిహెచ్ రాంబాబు, వాసవిరాజు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us