పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

UPDATED 19th DECEMBER 2018 WEDNESDAY 6:00 PM

కాకినాడ: పెథాయ్ తుఫాన్ అనంతరం వైద్య శిబిరాలు నిర్వహణ, రక్షిత మంచినీటి సరఫరా, పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనీ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ గీతా ప్రసాదిని, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జయశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో జిల్లా అధికారులు, ప్రోగ్రాం అధికారులతో అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ గీతాప్రసాదిని, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జయశ్రీ బుధవారం సమీక్షా సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ నగర పాలక సంస్థలో పారిశుధ్య పనులు తక్షణమే చేపట్టాలని, మురుగునీరు నిల్వ లేకుండా రక్షణ చర్యలు తీసుకొవాలని మున్సిపల్ హెల్త్ ఆఫీసరును ఆదేశించారు. డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, మలేరియా వ్యాధులపై మరింత శ్రద్ధ తీసుకొని అవగాహన కల్పించాలని, అలాగే  ఏఎన్ఎం డిజిపై శిక్షణా కార్యక్రమాలు ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎన్. ప్రసన్నకుమార్, అడిషనల్ డిఎం&హెచ్ వో డాక్టర్ పవన్ కుమార్, డిఐవో డాక్టర్ మల్లిక్, డిపిఎంవో డాక్టర్ కేశవ్ ప్రసాద్, పిఓడిటిటి డాక్టర్ సత్యనారాయణ, డిసిఆర్ బిఎస్ కె డాక్టర్ ఎన్. రాజేశ్వరి, ఎంహెచ్ఓ డాక్టర్  లక్ష్మీదేవి, డిఎన్ఎంఓ డాక్టర్ రాఘవేంద్ర, ఎంఐడిఎసిపి డాక్టర్ సుకాంతి, డిఎంఓ తులసి, డిఈఎంఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

 

ads