అమరగిరిపై భారీ అన్నదానం

UPDATED 18th FEBRUARY 2018 SUNDAY 12.30 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలోని అమరగిరిపై వేంచేసివున్న పంచాయతన సహిత ఛాయా, ఉషా, ప్రజ్ఞాదేవి సమేత శ్రీ సూర్యనారాయణస్వామి వారి దేవాలయంలో ఆదివారం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు ఐదు వేల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అన్న ప్రసాదాన్ని స్వీకరించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అలాగే స్వామి, అమ్మవార్లకు ఉదయం సుప్రభాతసేవ నిర్వహించారు. సూర్య భగవానుడికి ప్రీతికరమైన రోజు ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ నిర్వాహకులు వై. అనంత లక్ష్మీదేవి, రవికిషోర్, రవి కిరణ్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.    
ads