ఆచార్య: మెగా అప్డేట్ వచ్చేసింది

రెడ్ బీ న్యూస్: మెగాస్టార్ చిరంజీవి, అజేయ దర్శకుడు కొరటాల శివ కలయికలో వస్తోన్న మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ ‘ఆచార్య’. చిరు 152 చిత్రంగా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు మేకర్స్.  ఇందులో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే పవర్ ఫుల్ కేరక్టర్ చేస్తున్నారు. సినిమా కథనాన్ని కీలకమైన మలుపు తిప్పే పాత్ర అదే అవడంతో అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ‘ఆచార్య’ నుంచి విడుదలైన టీజర్, రెండు సింగిల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఆచార్య’ చిత్రంలో రామ్ చరణ్ ‘సిద్ధ’ పాత్ర కి సంబంధించిన టీజర్ విడుదల కాబోతోంది. ఈ నెల 28న ‘సిద్ధసాగా’ పేరుతో ఈ టీజర్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అయితే అందులో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నదీ మెన్షన్ చేయలేదు. చిరంజీవి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్టర్ ను షేర్ చేస్తూ.. ‘సిద్ధ మరపురాని పాత్ర అవుతుంది. దానికి చాలా కారణాలున్నాయి. పవర్ ఫుల్ టీజర్ వచ్చేస్తోంది.’ అంటూ మెగా అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us