ప్రత్యేక హోదాపై సిపిఎం నిరసన

UPDATED 23rd JULY 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ నాయకులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి కరణం ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవసరం లేదని చెప్పడం దారుణమని, రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఏ పార్టీ మనుగడ సాధించలేదని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కేంద్రానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. అనంతరం పార్టీ నాయకులు తహసీల్దారుకు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తుంపాల శ్రీనివాస్, సత్యన్నారాయణ, డి. సింహాచలం, కరణం శ్రీనివాస్, కె. రామకృష్ణ, కె. వెంకటేష్, కోన శ్రీను, టి. చిన్నా, నారాయణరావు, మాణిక్యం, సతీష్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. 

   
ads