గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ సేవలు చిరస్మరణీయం

UPDATED 26th APRIL 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: భారతదేశ గణిత పాఠాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ సేవలు చిరస్మరణీయమని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ హెడ్ మాస్టర్ తోటకూర సాయి రామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక హైస్కూల్ లో శ్రీనివాస రామానుజన్ 99వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాయి రామకృష్ణ మాట్లాడుతూ ప్రతిభకు పేదరికం ఏ మాత్రం అడ్డు కాలేదని, ముప్పై మూడేళ్ల అతి చిన్న వయసులోనే ఆయన మరణించడం తీరని లోటని, రామానుజన్ స్ఫూర్తితో నేటి విద్యార్థులు గణితంలో ప్రతిభ చూపడం ద్వారా భారతీయ వారసత్వ సంపదను పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.వి.వి. సత్యన్నారాయణ, కె. శ్రీనివాస్, ఎ.సి. రాజేంద్రకుమార్, బాల బాలాజీ, భద్రావతి, ప్రవల్లిక, బి. శ్రీలక్ష్మి, దేవి, లక్ష్మి, సుమ, డి.వి.వి. సత్యన్నారాయణ, శివ మాస్టారు, తదితరులు పాల్గొన్నారు.

ads