ఘనంగా భీమేశ్వరస్వామి త్రిశూల స్నాన పూజలు

UPDATED 15th FEBRUARY 2018 THURSDAY 7:00 PM

సామర్లకోట: మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం ఐదవ రోజు ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వరస్వామి వారి త్రిశూల స్నాన పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయం నుంచి పల్లకిలో ఊరేగింపుగా త్రిశూలాన్ని కోనేరు వద్దకు వేదమంత్రాలు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తీసుకుని వచ్చారు. స్వామివారి కల్యాణానికి దీక్షాధారణ చేసిన చేబోలు కిరణ్ కుమార్ దంపతులు త్రిశూల స్నానం ప్రారంభించారు. భక్తుల శివనామస్మరణలతో కోనేరు పరిసరాలు మార్మోగాయి. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహనరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ ఈవో పులి నారాయణ మూర్తి, వేదపండితులు పండితులు వేమూరి సోమేశ్వరశర్మ, సన్నిధిరాజు వెంకన్న కుమార్ అంజిబాబు, చెరకూరి రాంబాబు పాల్గొన్నారు. శుక్రవారం స్వామివారి శ్రీ పుష్పయాగోత్సవంతో మహాశివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.

ads