రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

UPDATED 30th JULY 2018 MONDAY 9:00 PM

సామర్లకోట రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని కాపవరం గ్రామం రైల్వే ట్రాక్ వద్ద డౌన్ లైన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అతని వయసు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు ఉండొచ్చని,  రైలు నుంచి జారిపడడం వల్ల బలమైన గాయం తగిలి చనిపోయి ఉంటాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ విజయకుమార్ తెలిపారు.

ads