85 సంవత్సరాలు దాటిన ఓటర్లు విచారణ వేగవంతం చేయాలి

UPDATED 5th DECEMBER 2018 WEDNESDAY 7:00 PM

పెద్దాపురం: 85 సంవత్సరాల దాటిన ఓటర్ల విచారణ చేపట్టి సంబంధించిన రిపోర్టును త్వరితగతిన  అందచేయాలని పెద్దాపురం నియోజకవర్గ ఎలక్షన్ రిటర్నింగు అధికారి, ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నియోజకవర్గ ఎఇఆర్వోలు, సూపరువైజర్లు, ఎలక్షన్ డిటిలతో సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవో వసంతరాయుడు మాట్లాడుతూ ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు 85 సంవత్సరాలు దాటిన ఓటర్లపై బి.ఎల్.వో, విఆర్వోలతో విచారణ చేపట్టి నివేదికను అందచేయాలని, నియోజకవర్గ పరిధిలో 85 సంవత్సరాలు దాటిన ఓటర్లు 634 మంది ఉన్నట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు. అలాగే ఫారం-6 ప్రకారం కొత్త ఓటర్లు, ఫారం-7 ప్రకారం ఓటర్లు తొలగింపు, ఫారం-8 ప్రకారం సవరణ, ఫారం-8ఎ ప్రకారం మార్పులు, డెమోగ్రఫీకల్ సిమిలర్ ఎంట్రీస్, లాజికల్ ఎర్రర్స్, విఐపి, జర్నలిస్టులు, వికలాంగుల ఓటర్లు తదితర అంశాలపై తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట తహసీల్దార్ ఎల్. శివకుమార్, ఇన్ చార్జ్ ఎంపిడివో సిహెచ్ జగ్గారావు, పెద్దాపురం డిప్యూటీ తహసీల్దార్ కృష్ణారావు, టిపిఎస్ జి. భాస్కరరావు, మేనేజర్ ప్రసాద్, ఎలక్షన్ డిటి కృష్ణ, నియోజకవర్గంలోని సూపరువైజర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

ads