బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలి

UPDATED 15th MARCH 2019 FRIDAY 9:00 PM

పెద్దాపురం: ఎన్నికలను నిష్పక్షపాతంగా, హుందాగా, సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో   బాధ్యతగా, జాగ్రత్తగా విధులు నిర్వహించాలని పెద్దాపురం ఆర్డీవో, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎన్.ఎస్.వి.బి. వసంత రాయుడు ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో కోడ్ ఆఫ్ కండక్ట్, ఎక్స్పెండిచర్, అకౌంట్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీముల అధికారులతో శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ ప్రతీరోజు ఎంసిసి, ఫ్లయింగ్ స్క్వాడ్, ఎసఎస్ టి, ఎక్స్పెండిచర్, అకౌంట్, వీడియోలకు కేటాయించిన టీములు రోజువారీ రిపోర్ట్ ను సాయంత్రం అందచేయాలని అన్నారు. అకౌంట్స్ టీమ్ అకౌంట్ కు సంబంధించిన షాడో అకౌంట్ ను మెయింటైన్ చేయాలని, ఈ మెయింటెనెన్స్ ను ఎకౌంట్ టీము ఎప్పటికప్పుడు పరిశీలించి రిపోర్టు తయారు చేయాలన్నారు. అలాగే వీడియోకు సంబంధించిన రోజువారీ కార్యక్రమాలు సీడీల ద్వారా పరిశీలించి కోడ్ ఆఫ్ కండక్ట్ గుర్తించి వాటికి సంబంధించిన సమాచారాన్ని అకౌంట్ టీముకు అందజేయాలన్నారు. ఎలక్షన్ కమీషన్ రూపొందించిన మోడల్ కోడ్, ఫ్లయింగ్ స్క్వాడ్, ఎక్స్పెండిచర్, వీడియో ఫార్మెట్లను ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకుని దాని ప్రకారం ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపాలన్నారు. వీడియోకు సంబంధించిన సీడీల విషయంలో రసీదును తీసుకోవాలన్నారు. విధులకు సంబంధించిన సమాచారంలో అనుమానాలు ఉంటే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ టీములకు సంబంధించిన విధి విధానాలను మీకు అందజేయడం జరిగిందని, వాటిని క్షుణ్ణంగా చదువుకుని లోపాలు లేకుండా విధులు నిర్వర్తించాలని ఆర్డీవో కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కె. గోపాలకృష్ణ, జి. నరసింహరావు, సామర్లకోట, పెద్దాపురం మున్సిపల్ కమీషనర్లు నాగేంద్రకుమార్, బి.ఆర్. శేషాద్రి, పెద్దాపురం ఎంపిడివో పి. ఉమామహేశ్వరరావు, సామర్లకోట ఈవోపీఆర్డీ సిహెచ్ జగ్గారావు, ఎంసిసి టీం లీడర్ డిటిఆర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us