విఆర్వోపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

UPDATED 7th JUNE 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: రంగంపేట మండలం సింగంపల్లి విఆర్వో షాలేంరాజుపై పోలీసులు నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని కోరుతూ సామర్లకోట విఆర్వోల సంఘం శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్వోల సంఘం అధ్యక్షుడు వి. శ్రీను మాట్లాడుతూ మామిడికాయలు దొంగిలించాడన్న అభియోగంపై గత నెల రంగంపేట మండలం సింగంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బక్కి శ్రీనివాస్ అనే వ్యక్తిని కొందరు హతమార్చిన ఘటనలో ఎలాంటి మేజిస్టీరియల్ విచారణ, తహసీల్దార్ అనుమతి లేకుండా ఏకపక్షంగా పోలీసులు వీఆర్వో షాలేంరాజును అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. ఈ హత్య జరిగే సమయంలో వీఆర్వో షాలెంరాజు రంగంపేట తహసీల్దార్ కార్యాలయంలో విధినిర్వహణలో ఉన్నప్పటికీ వీఆర్వోపై అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదని అన్నారు. వీఆర్వోపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోల సంఘం అధ్యక్షుడు వి. శ్రీను, వాసు, అప్పారావు, ఖాదర్‌ వల్లి, తదితరులు పాల్గొన్నారు.

ads