జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి

కాకినాడ,16 మే 2020 (రెడ్ బీ న్యూస్): గ్రామ,వార్డు సెక్రటేరియేట్ల అభివృద్ధి పనుల పర్యవే క్షణకు జిల్లా ప్రత్యేక జాయింట్ కలెక్టర్‌గా నియమితులైన చేకూరి కీర్తి కాకినాడ కలెక్టరేట్ లో శనివారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కలెక్టర్ మురళీధర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్న ఆమె తనకు కేటాయించిన ప్రత్యేక ఛాంబరులో విధులకు హాజరయ్యారు. చిత్తూరు జిల్లా మదనపల్లి డివిజన్ సబ్ కలెక్టర్ గా పనిచేస్తూ మన జిల్లాకు వచ్చారు.
ads