ఇది నాకో క్లిష్టమైన సంవత్సరం: సమంత

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021‌: ఈ ఏడాది తన జీవితంలో ఎంతో కష్టంగా సాగిందని అగ్రకథానాయిక సమంత అన్నారు. బాలీవుడ్‌, దక్షిణాదికి చెందిన పలువురు తారలతో ఇటీవల ఓ ఛానల్‌ స్పెషల్‌ ఇంటర్వ్యూ నిర్వహించింది. తాప్సీ, విక్కీ కౌశల్‌, సిద్దార్థ్‌ మల్హోత్రతోపాటు నటి సమంత ఈ సరదా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. డిసెంబర్‌ 6న ఈ ఇంటర్వ్యూ ఫుల్‌ వీడియో ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో ఓ స్పెషల్‌ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో 2021 ఎలా గడిచిందో ఒక్కమాటలో చెప్పాలని తారల్ని కోరగా.. అందరూ భిన్నమైన అభిప్రాయాలు పంచుకున్నారు. సమంత మాట్లాడుతూ.. ‘‘తన జీవితంలో 2021 ఓ క్లిష్టమైన ఏడాది’’ అని తెలిపారు. ఈ వీడియో చూసిన సామ్‌ అభిమానులు.. ‘‘బీ స్ట్రాంగ్‌’’ అని కామెంట్లు చేస్తున్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us