UPDATED 16th FEBRUARY 2018 FRIDAY 11:00 PM
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని ప్రసిద్ధ పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరి అమ్మవార్ల కల్యాణోత్సవాలు శుక్రవారం రాత్రితో ఘనంగా ముగిశాయి. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రహాలకు చక్రస్నానం, త్రిశూల స్నానం చేయించారు. రాత్రి స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను హంస వాహనంపై ఉంచి పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించారు. తొలుత ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వర్మ దంపతులు ప్రారంభించారు.. ఆలయ పరిసరాలన్నీ భక్తుల శివనామ స్మరణలతో మార్మోగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కొండేపూడి ప్రకాష్ దంపతులు, ఈవో పుష్పనాథ్, ట్రస్టు బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.