ప్రముఖ టెలికాం కంపెనీ కొనుగోలుకు రిలయన్స్‌ ఆసక్తి?

ముంబయి (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఓ ప్రముఖ టెలికాం కంపెనీని కొనుగోలు చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. బ్రిటన్‌కు చెందిన ఫిక్స్‌డ్‌ లైన్ టెలికాం కంపెనీ ‘బీటీ గ్రూప్‌’ను స్వాధీనం చేసుకోవడమో లేదా నియంత్రిత వాటాను కొనుగోలు చేసేందుకు ఆఫర్‌ చేయొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపినట్లు ప్రముఖ వాణిజ్య పత్రిక పేర్కొంది. అందుకు ప్రతిఫలంగా బీటీ గ్రూప్‌నకు చెందిన నెట్‌వర్కింగ్‌ విభాగపు వ్యాపార విస్తరణకు నిధులు సమకూర్చేందుకు రిలయన్స్‌ యోచినట్లు సమాచారం. అయితే, చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఇరు కంపెనీ అధినేతల భేటీ జరగలేదని సమాచారం. దీనిపై స్పందించడానికి ఇరు కంపెనీలు నిరాకరించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం మార్కెట్‌ అయిన భారత్‌లో రిలయన్స్‌ ఆధ్వర్యంలోని జియో ఇన్ఫోకామ్‌ హవా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. జియోతో పోటీ పడలేక అనేక సంస్థలు తమ కార్యకలాపాల్ని మూసివేశాయి. ఇక బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్‌ దేశీయ సంస్థ ఐడియాతో భాగస్వామ్యం కుదుర్చుకొంది. సెప్టెంబరులో బ్రిటన్‌కు చెందిన టీ-మొబైల్‌ను కూడా సొంతం చేసుకునేందుకు రిలయన్స్ బిడ్లు దాఖలు చేసింది. కానీ, అపాక్స్‌, వార్‌బగ్‌ పింకస్‌ కన్సార్టియంల బిడ్‌ విజయవంతమవడంతో రిలయన్స్‌ పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us