ఎల్ఐసి ఏజెంట్ల సమస్యలు పరిష్కరించాలి

UPDATED 7th SEPTEMBER 2018 FRIDAY 6:00 PM

పెద్దాపురం: ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపు మేరకు న్యాయపరమైన తమ కోర్కెలు తీర్చాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎల్ఐసి కార్యాలయంపై వద్ద పెద్దాపురం ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో వారు మాట్లాడుతూ పాలసీ ప్రీమియంపై జిఎస్టీని వెంటనే రద్దు చేయాలని, పాలసీదార్లకు బోనస్ పెంచాలని అన్నారు. కొత్త పాలసీల రివైవల్ పీరియడ్ రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు పెంచి పాలసీలను పునరుద్ధరించాలని, నష్టాల్లో ఉన్నఐడిబిఐ బ్యాంక్ ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. దుర్గాప్రసాదరావు, ఉపాధ్యక్షుడు సి.హెచ్.ఎస్.వి. ప్రసాద్, కార్యదర్శి ఎం. శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ ఎం.వి.వి. సత్యనారాయణ, సీనియర్ ఏజెంట్లు, స్టాఫ్ అసోసియేషన్ లీడర్లు కె. కొండరామయ్య, అప్పారావు, సోమరాజు, లక్ష్మి, రామకృష్ణ, ఎస్. గౌరీపతిరావు, బి. వీరభద్రరావు, టి. అచ్యుతరామయ్య, నీలం సత్యనారాయణ, చక్రవర్తి, గోపి, అర్జునరావు, రెడ్డమ్మ, జి. సత్యనారాయణ, టి.వి. నరసింహారావు, అప్పన నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.                 

ads