ప్రగతిలో మానసిక ఒత్తిడి సమతుల్యతపై అవగాహనా సదస్సు

UPDATED 2nd JULY 2018 MONDAY 7:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో మానసిక ఒత్తిడి దాని సమతుల్యతపై సోమవారం అవగాహనా సదస్సు నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తెలిపారు. సామర్లకోట బ్రహ్మాకుమారిస్ సెంటర్ సహకారంతో నిర్వహించిన ఈ అవగాహనా సదస్సుకు ముఖ్య అతిథిగా బ్రహ్మకుమారి పార్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో విద్యార్థులు, అధ్యాపకులు అభివృద్ధి సాధించి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చని, సానుకూల దృక్పధం, వ్యాయామం, సమతుల్య ఆహారం, గాఢనిద్ర, మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి ముఖ్యమైనవి అని, ప్రతీ నిత్యం యోగా, ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్ మెంట్ ఎమ్.వి. హరనాధబాబు, డైరెక్టర్ డాక్టర్ జి.రఘురామ్, వైస్ ప్రెసిడెంట్ ఎమ్. సతీష్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మిన్ డాక్టర్ జి. నరేష్, డీన్ ఆర్&డి డాక్టర్ పి.వి.ఎస్. మాచిరాజు, వివిధ విభాగాధిపతులు, కళాశాల సిబ్బంది, సుమారు 800 మంది విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

ads