‘నిన్ను నమ్మం బాబు’ అని సాగనంపాలి

UPDATED 4th APRIL 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట: ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి అధ్వాన్నపాలన అందించిన చంద్రబాబును ‘నిన్ను  నమ్మం బాబు’ అని సాగనంపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థిని తోట వాణి పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సామర్లకోట మండలం వెంకటకృష్ణ రాయపురం, కొత్తూరు, బోయినపూడి, సత్యవరంపేట, కొప్పవరం, అచ్చంపేట, బ్రహ్మానందపురం, పి.వేమవరం, తదితర గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటకృష్ణ రాయపురంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అడుగడుగునా అధిక సంఖ్యలో మహిళలు పూలమాలలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తోట వాణి మాట్లాడుతూ టీడీపీ చేస్తున్న మోసపూరిత హామీలను నమ్మొద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలని అన్నారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి అమలు చేయాలని నిర్ణయించిన నవరత్నాల పథకాలతో పేదల, రైతుల, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరతాయని పేర్కొన్నారు. ఈనెల 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సలాది దొరబాబు, గొల్లపల్లి సర్వేశ్వరరావు, ఎం. వీరభద్రరావు, సిహెచ్ బులిరాజు, కె. ఆచారావు,  బద్దిరెడ్డి వీరభద్రరావు, చల్లా శ్రీనివాస్, కోట యోగేశ్వరరావు, వీరంరెడ్డి దొరబాబు, చినబాబు, రమేష్, తుమ్మలపల్లి బాబ్జీ, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ads