అమరవీరుల స్ఫూర్తితో అభివృద్ధి సాధిద్దాం

UPDATED 1st NOVEMBER 2019 FRIDAY 8:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధికి పాటుపడదామని ఎంపీడీవో కె. స్వప్న, మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం తెలుగు జాతికి ప్రతీకగా నిలిచిందని, దేశంలో హిందీ తరువాత తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య అధికంగా ఉన్నారని అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, అందరికీ చదువు, ఆరోగ్యం, సంక్షేమం అమలు చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరెంటెండెంట్ విప్పర్తి సాయిబాబు, ఈవోపీఆర్డీ కె. వెంకట సూర్యనారాయణ, జి. వెంకటేశ్వరరావు, ప్రభాకర్, ఐసిహెచ్ హెల్డా, శ్రీనివాసరావు, మున్సిపల్ డిఇ రామారావు, ఏఈ ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.

ads