స్థిరాస్తుల రీ సర్వే విజయవంతం చేయాలి: జేసీ లక్ష్మీశ

కాకినాడ,19 డిసెంబరు 2020 రెడ్ బీ న్యూస్: రైతులు, భూ యజమానుల శాశ్వత ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ నెల 21 నుంచి చేపడుతున్న 'మీ భూమి- మా హామీ'లో భాగంగా వ్యవసాయ, గ్రామకంఠ స్థిరాస్తుల రీ సర్వే జిల్లాలో విజయవంతం చేయాలని జేసీ లక్ష్మీశ కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంపిక చేసిన సర్వేయర్లు, వీఆర్వో, వీఆర్ఏలకు శనివారం కలెక్టరేట్ లో వర్క్ షాపు నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ రీ సర్వే విజ యవంతమవ్వాలంటే భూ యజమానులు, రైతుల భాగస్వామ్యం అవసరమన్నారు. జిల్లా, డివిజన్ స్థాయిలో కమాండ్ కంట్రోల్ నెంబర్లు ఏర్పాటు చేస్తున్నామని, అందువల్ల సిబ్బందికి సర్వేలో సందేహాలుంటే సెంటర్స్ లో తెలుసుకోవాలని సూచించారు. సర్వే పూర్తయ్యాక ప్రతి భూ యజమానికి శాశ్వత హక్కు పత్రం ఇస్తామని తెలిపారు. కేఆర్ సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, రీ సర్వే జిల్లా మానిటరింగ్ అధికారి శ్రీరామచంద్రమూర్తి, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు సమక్షంలో జేసీ రీ సర్వేపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, రాజమ హేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి, సర్వేశాఖ ఏడీ గోపాలకృష్ణ, సర్వే ఇన్ స్పెక్టర్ లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.
ads