భీమేశ్వరాలయ ఈవోగా వెంకటేశ్వరరావు

సామర్లకోట: 15 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): పంచారామ క్షేత్రమైన సామర్లకోట కుమారరామ భీమేశ్వర ఆలయ కార్యనిర్వహణాధికారిగా కాకినాడ గ్రూప్ టెంపుల్స్ కు చెందిన యర్రా వెంకటేశ్వరరావు సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు ఈవోగా బాధ్యత నిర్వహించిన పులి నారాయణమూర్తి కాకినాడ గ్రూప్ టెంపుల్స్ కు బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఈవో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేయనున్నట్లు చెప్పారు.
ads