ఆదిత్యలో సిఎస్ఐ స్టూడెంట్ చాప్టర్ ప్రారంభం

UPDATED 14th JULY 2018 SATURDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సిఎస్ఐ) స్టూడెంట్ చాప్టర్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఐటి) డాక్టర్ బి. గోవర్ధన్ రెడ్డి, ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కళాశాల సిఎస్ఇ విభాగధిపతి ప్రొఫెసర్ పి. సీతారామరాజు ముఖ్య అతిథులుగా హాజరై స్టూడెంట్ చాప్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు విద్యార్థుల సామర్ధ్యానికి మెరుగుదిద్దడంలో ఆదిత్య కృషి ఎనలేనిదని ఈ సందర్భంగా యాజమాన్యాన్ని, ప్రిన్సిపాల్ ఆదిరెడ్డి రమేష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ సీతారామరాజు ప్రోగ్రామింగ్ స్కిల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమేష్ మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించడంలో అన్ని విధాల ఈ స్టూడెంట్ చాప్టర్ ఉపయోగపడుతుందని, విద్యార్థులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సాంకేతికపరంగా మరింత ఉన్నతి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎస్. రమాశ్రీ, ఎ. రామకృష్ణ, సిఎస్ఇ విభాగాధిపతి డాక్టర్ పి.వి.ఎస్.వి.వి.ఎస్. రవికుమార్, విభాగాధిపతులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ads