వైద్య,ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత

Updated 28th April 2017 Friday 12:30 PM

పిఠాపురం: వైద్య ఆరోగ్య రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణం లో నాబార్డ్ ఆర్ ఐ డి ఎఫ్ నిధులు రూ. 2 .69  కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత విస్తృతంగా చేరువలోకి తెచ్చాయని, తద్వారా ప్రజలు వైద్యం కోసం చేసే ఖర్చు గణనీయంగా తగ్గిందన్నారు. వైద్య సిబ్బందిని అవసరం మేరకు కాంట్రాక్టు పద్దతిలో నియమించామన్నారు. రాష్ట్రంలో 40 రకాల వైద్య పరీక్షలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని 1400  ఆసుపత్రుల ద్వారా గత సంవత్సరం ప్రజలకు కోట్లాది రూపాయల ఖర్చుతో వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. అలాగే ఏఎన్ఎం లకు 16 వేలు టాబ్ లు పంపిణీ చేసి మదర్ అండ్ చైల్డ్ ట్రాకింగ్ సిస్టం ద్వారా మాతా శిశు మరణాలను నియంత్రించామన్నారు. మూడు సంవత్సరాల క్రితం అరకొర వసతులతో నడుస్తున్న ఈ సి హెచ్ సి ౩౦౦ ఒపి సేవల స్థాయికి చేరి ౩౦ పడకల ఆసుపత్రిగా అభివృద్ధి కావడం పట్ల స్థానిక ఎమ్ఎల్ఏ వర్మ కృషి అభినందనీయమన్నారు. అలాగే ఈ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రి గా మార్చనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎమ్ఎల్ఏ ఎస్ వి ఎస్ ఎస్ వర్మ మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధికి సహకరించిన మంత్రి శ్రీనివాస్ కు  ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. త్వరలో ఆసుపత్రిలో వెయిటింగ్ హాల్ నిర్మాణం కూడా చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కరణం చిన్నారావు, హెల్త్ సర్వీసెస్ డిసి డాక్టర్ పి. రమేష్ కిషోర్, డిఎమ్ అండ్ హెచ్ ఓ డాక్టర్ కె. చంద్రయ్య, ఏ.పి.ఎమ్.ఎస్.ఐ.డి.సి ఎస్ ఈ శ్యాంబాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెన్నకేశవ రావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పంతం వెంకట ఫనీంద్ర రాధేశ్, సభ్యులు జి. విజేంద్రరావు, వాసిరెడ్డి వాసు, కె. సత్యవతి, బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టిబాబు, పట్టణ టిడిపి ప్రెసిడెంట్ సత్యనారాయణ, సి.హెచ్.సి వైద్యాధికారి డాక్టర్ విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు.       

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us