ప్రభుత్వ కార్యక్రమాలపై సీఎం సమీక్ష

UPDATED 25th AUGUST 2020 TUESDAY 9:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): ప్రభుత్వ కార్యక్రమాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని  తన  క్యాంప్ కార్యాలయం నుంచి స్పందనపై అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదలు కారణంగా ముంపుకు గురైన ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక కార్యక్రమాలు, కోవిడ్-19, ఇళ్ళ స్థలాలు, జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన నిర్మాణ పనుల పురోగతి, నాడు-నేడు వైఎస్ఆర్ చేయుత, వ్యవసాయం, తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జి. లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి. రాజకుమారి, రాజమహేంద్రవరం కమీషనర్ అభిషక్త కిషోర్, అమలాపురం, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్లు హిమాన్షు కౌషిక్, అనుపమ అంజలి, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, తదిరులు పాల్గొన్నారు.

 

ads