మున్సిపల్ కార్యాలయంలో రెండవ రోజు కొనసాగిన ఏసీబీ తనిఖీలు

* బయటపడిన టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాల అక్రమాలు

* ఉన్నతాధికారులకు నివేదికలు పంపిన ఏసీబీ

* టీపీవో, టీపీఎస్, ఆర్ఐలో భయాందోళన

UPDATED 28th AUGUST 2021 SATURDAY 6:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు రెండవ రోజు కూడా కొనసాగాయి. ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో అధికారుల బృందం రెండవ రోజు పట్టణంలో ప్లాన్లకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించిన పలు భవనాలు, అనధికార లే అవుట్లకు సంబంధించిన కొలతలు తీసుకున్నారు. టీపీవో, టీపీఎస్ అక్రమాలు బహిర్గతం కావడంతో వారిలో ఆందోళన నెలకొంది. అలాగే రెవెన్యూ విభాగంలో కూడా అక్రమాలు వెలుగుచూసినట్లు తెలిసింది. దీనిపై నివేదికలను తయారుచేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో  వై. సతీష్, పుల్లారావు, వాసు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us