జనసేనలో చేరిన ఠాగూర్

UPDATED 23rd JUILY 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా నుంచి 200 మంది కార్యకర్తలతో వెదురుపాక మార్తాండ ఠాగూర్ విజయవాడలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విలేఖరులతో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ ఆలోచనలు, సిద్ధాంతాలు, పార్టీ అధినేత ఆలోచనలు నచ్చాయని, బడుగు, బలహీన వర్గాలు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రగతి సాధనకు జనసేన పార్టీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణరావు, సతీష్ నాయుడు, చంద్రశేఖర్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

ads