సమస్యలు పరిష్కారానికే గ్రామదర్శిని

UPDATED 20th SEPTEMBER 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: ప్రజల చెంతకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్న లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామదర్శిని కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరావు అన్నారు. పట్టణ పురపాలక సంఘ పరిధిలో తొమ్మిది, పది వార్డుల్లో గ్రామదర్శిని కార్యక్రమం గురువారం నిర్వహించారు. గత నాలుగు సంవత్సరాల నుంచి సామర్లకోట పురపాలక సంఘంలో జరిగిన వివిధ అభివృద్ధి పధకాలు గురించి భాషా సాంస్కృతిక శాఖ రాజమండ్రి ఎస్.చలం జానపద కళాబృందంచే జానపదాలు ద్వారా అవగాహన కల్పించారు.  రాబోయే కాలానికి సంబందించి వివిధ పధకాల ద్వారా అభివృద్ధి చేయుటకు ప్రణాళికను తయారుచేయుటకు కావలసిన సమాచారము సేకరించారు. ఈ కార్యక్రమములో డిప్యూటీ ఎగ్జిక్యుటివ్ ఇంజనీరు, రెవెన్యూ ఆఫీసరు, టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, ఎలక్ట్రికల్, హౌసింగ్, రెవిన్యూ, హెల్త్ సిబ్బంది, 30 వార్డులకు సంబంధించిన నోడల్ అధికారులు వార్డు మెంబరు, ప్రజలు పాల్గొన్నారు. 

ads